బాన్సువాడలో పోచారం ఒంటరే!

5
- Advertisement -

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని పార్టీ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బాన్స్‌వాడ నియోజకవర్గంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగా నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు ఈరోజు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు స్థానికంగా బాన్స్‌వాడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై చర్చించారు.బాన్స్‌వాడ నియోజకవర్గం గులాబీ జెండాకు కోటని, ప్రజల తీర్పును, పార్టీ కార్యకర్తల శ్రమను వంచించి తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఒంటరిగా మిగిలారని పార్టీ నేతలు కేటీఆర్‌కు తెలియజేశారు.

ఈ సందర్భంగా గత 20 నెలలుగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం బాన్స్‌వాడలో విజయవంతంగా కొనసాగుతున్నదని, గ్రామగ్రామాన గులాబీ పార్టీతో నిలబడిన కార్యకర్తల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉందని, దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్స్‌వాడ నియోజకవర్గంలో మంచి విజయాలు సాధించేలా అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు బాన్స్‌వాడ నుంచి వచ్చిన కామారెడ్డి జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జుబేర్, నాయిని పద్మ మరియు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Also Read:బాలయ్యకు పవన్ విషెస్

- Advertisement -