బ్యాంకులకు వరుస సెలవులంటూ కొన్నిరోజులగా సోషల్ మీడియాలో వార్త వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29వ తేదీన మహావీర్ జయంతి,30వ తేదీన గుడ్‌ఫ్రైడే, 31న ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు, ఏప్రిల్ ఒకటి ఆదివారం, ఏప్రిల్ రెండో తేదీ వార్షిక ముగింపు సెలవుదినం. ఇలా వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు రాబోతున్నాయని నెట్టింట్లో వార్త వైరల్ కావడంతో నగదు కొరత ఏర్పడుతుందేమోనని ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య స్పందించింది. బ్యాంకులకు వరుస సెలవులు లేవంటూ స్పష్టత నిచ్చింది. మహవీర్ జయంతి సందర్భంగా గురువారం, గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బ్యాంకులకు సెలవు అని తెలిపారు.
ఇక మార్చి 31 ఈ నెలలో ఐదో శనివారం అవుతుందని.. అందుచేత ఆ రోజు బ్యాంకు పనిచేస్తుందన్నారు. ఏప్రిల్ 1 ఆదివారం హాలీడే కాగా.. ఏప్రిల్ 2న బ్యాంకులు పనిచేస్తాయా లేదా అన్నదానిపై మాత్రం రాజేంద్రదేవ్ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.