శ్రీ రెడ్డి ‘లీక్స్ స్టార్టెడ్’..

191
Sensational Pic In Sri Leaks
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని పక్కాగా వాడేసుకుంటూ ఛానల్స్ చుట్టూ తెగ తిరిగేస్తోంది నటి శ్రీ రెడ్డి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రచ్చ జరుగుతుండగా.. టాలీవుడ్ లో 99 శాతం మంది ఆడవాళ్లను వాడుకునేవారేనని ఇటీవలి కాలంలో వివిధ టీవీ చానళ్లలో స్పెషల్ డిస్కషన్లు పెడుతుంది శ్రీ రెడ్డి, టాలీవుడ్ ప్రముఖుల బాగోతాన్ని బయటపెడతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Sensational Pic In Sri Leaks

ఈ అమ్మడు తన దగ్గర కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా బయట పెడతానని చెప్పింది. అన్నట్టుగానే శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఫోటోను పెట్టింది. ఇందులో ముఖం కనిపించని ఓ వ్యక్తి శ్రీ రెడ్డిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ‘లీక్స్ స్టార్టెడ్’ అంటూ శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుండగా, ఇలా ఈ హాట్‌ బ్యూటీ ఇంకా ఎందరి భాగోతాలు బయటపెడుతుందో చూడాలి మరి.

- Advertisement -