బాలయ్య అల్లుడికి బ్యాంకు నోటీసులు..!

253
Balakrisha Son In Law
- Advertisement -

టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే,సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీ భరత్‌కు బ్యాంకు నుండి భారీ షాక్ తగిలింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున భరత్ తండ్రి పట్టాభి రామారావు, చిన్నాన్న లక్షణరావు, ఇతర కుటుంబ సభ్యులకు హైదరాబాద్ కరూర్ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై శ్రీ భరత్ స్పందించకపోవడంతో.. ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమైంది.

టెక్నో యునీక్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట, గతంలో వీరు రుణాన్ని తీసుకున్నారు. బ్యాంకు అప్పు తీర్చాలని వారిని పలుమార్లు సంప్రదించినా, ప్రయోజనం లేకపోయిందని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. దీంతో వారికి నోటీసులు పంపించామని, తదుపరి ఆస్తులను జప్తు చేసే కార్యక్రమాలను కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని ఓ అధికారి వెల్లడించారు. బ్యాంకు నుంచి తీసుకున్న అసలు, దానికి వడ్డీ మొత్తం కలిపి 124.39 కోట్లు అయిందని, వెంటనే దాన్ని చెల్లించాలని ఈ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -