బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఎన్నో వివాదాల మధ్య రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ షో పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోను బ్యాన్ చేయాలంటూ పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈషోకు వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న అక్కినేని నాగార్జన ఇంటిని కూడా ముట్టడించారు ఓయూ విద్యార్దులు.
బిగ్ బాస్ 3 పై యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తాలు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3లో తమకు తీసుకుంటామని చెప్పి లైంగికంగా వేధించారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే తాజాగా స్టార్ మా టీవికి నోటిసులు ఇచ్చారు పోలీసులు.
నిన్న సాయంత్రం స్టార్ మా కార్యాలయానికి వెళ్లి నోటిసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. నికి ఆరు ప్రశ్నలు సంధించారు. అగ్రిమెంట్ వ్యవహారం, ఎంపిక విధానం, నిబంధనలు, శ్యాం, మిగిలిన ముగ్గురి పాత్రకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. నోటీసులు అందుకున్న స్టార్ మా చానల్ సంస్థ అడ్మిన్ హెడ్ శ్రీధర్.. యాజమాన్యంతో మాట్లాడి రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని పోలీసులకు తెలిపారు.