బంగ్లా కోచ్ రాజీనామా..

461
bangladesh coach
- Advertisement -

బంగ్లాదేశ్‌ కోచ్ రస్సెల్ డొమింగో తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో కోచ్ పదవికి రాజీనామా చేశారు డొమింగో. ప్రపంచ కప్ కు ముందు డొమింగో రాజీనామా చేయడం చర్చనియాంశంగా మారింది.

కోచ్ రాజీనామా విషయంపై బంగ్లా క్రికెట్ బోర్డు కార్యకలాపాల చైర్మన్ జలాల్ యూనస్ మాట్లాడుతూ.. రస్సెల్ డొమింగో తన రాజీనామాను భారత్ జట్టుతో టెస్టు సిరీస్ ఓటమికి ముందే ఇచ్చాడని, అది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. డోమింగో రాజీనామా చేసినప్పటికీ పేస్ బౌలింగ్ కోచ్, సహచర దక్షిణాఫ్రికా ఆటగాడు అలన్ డొనాల్డ్ తో సహా ఇతర కోచింగ్ సిబ్బంది అందరూ తమ విధుల్లో ఉంటారని జలాల్ చెప్పాడు. త్వరలోనే కొత్త కోచ్ నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -