ఆసియా కప్ గ్రూప్ బీలో భాగంగా ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 335 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ ఇబ్రహీం (75), కెప్టెన్ షాహిదీ (51), రహ్మత్ షా (33) మాత్రమే పోరాడారు.దీంతో బంగ్లాదేశ్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా భారీ స్కోరు సాధించింది. మెహిదీ హసన్ (112), షంటో (104) సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ 215 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ షకీబ్ (32 నాటౌట్), ముష్ఫికర్ (25) వేగంగా ఆడారు. ముజీబ్, గుల్బదిన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా మెహిదీ హసన్ నిలిచాడు.
మంగళవారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకను అఫ్ఘాన్ ఓడిస్తే మూడు జట్లు కూడా రెండేసి పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ ఎక్కువ ఉన్న జట్టు సూపర్4కు వెళుతుంది.
Also Read:Bigg Boss 7 Telugu:కంటెస్టెంట్స్ వీరే