‘బంగార్రాజు’ న్యూ ఇయర్‌ ట్రీట్‌ రెడీ..

17

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున బంగార్రాజు టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో తండ్రీ కొడుకులు – నాగార్జున, నాగ చైతన్య మీసాలు తిప్పుతూ హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. నాగార్జున పంచెక‌ట్టులో నాగ‌చైత‌న్య స్టైలీష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వ‌చ్చిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం
కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫ‌ర్: యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్