బంగార్రాజు..కీ అప్‌డేట్

126
nag
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

‘బంగారా బంగారా బుల్లెటెక్కి వచ్చేయ్ రా’ అనే లిరికల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. చైతూ – కృతి శెట్టిపై చిత్రీకరించిన ఈ పాట, అప్పుడే 1 మిలియన్ కి పైగా వ్యూస్ ను కొల్లగొట్టేసింది. పూర్తి సాంగ్ ను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు.

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ కావడంతో, ఈ సినిమా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్రయూనిట్.

- Advertisement -