టీటీడీ ట్రస్టులకు రూ. కోటి విరాళం

19
ttd

టిటిడిలోని నాలుగు ట్రస్టులకు గురువారం రూ. కోటి విరాళంగా అందింది. ఈ మేరకు దాతలు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో విరాళం చెక్కును ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబుకు అందజేశారు.

శ్రీ చైత‌న్య విద్యా సంస్థ‌ల‌ ఛైర్మన్‌ శ్రీమ‌తి ఝాన్సీరాణి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 ల‌క్ష‌లు, ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.25 ల‌క్ష‌లు, బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.25 ల‌క్ష‌లు, ఎస్వీ స‌ర్వ‌ శ్రేయస్సు ట్ర‌స్టుకు రూ.25 ల‌క్ష‌లు అందించారు.