కాంగ్రెస్‌కు షాక్‌..బీఆర్ఎస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే

33
- Advertisement -

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసిన కృష్ణ మోహన్‌ రెడ్డి ఇకపై పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఇవాళ సాయంత్రం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని కలవనున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కృష్ణ మోహన్ రెడ్డి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. దీంతో కాంగ్రెస్‌లో చేరారు కృష్ణ మోహన్ రెడ్డి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా తాజా బండ్ల వెనక్కి రావడంతో ఆ సంఖ్య 9కి చేరింది.

Also Read:మ్యాసీవ్ సెట్‌లో ఒదెల 2

- Advertisement -