మొక్కలు నాటిన ఎమ్మెల్యే సతీమణి…

684
bandla jyothi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన జోగులాంబ గద్వాల్ జిల్లా టి.ఆర్.ఎస్ మహిళ నాయకురాలు , ఎం.ఎల్.ఏ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి బురెడ్ పల్లె గ్రామ సర్పంచ్ బండ్ల జ్యోతి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి విశేష స్పందన వచ్చిందన్నారు . ఇందులో భాగంగా జోగులంబా గద్వాల్ జిల్లా ధరూర్ మండలం బూరెడ్ పల్లె గ్రామంలో సర్పంచ్ బండ్ల జ్యోతి గారు మూడు మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి 1.గుడ్డేమ్ దొడ్డి గ్రామ సర్పంచ్ రఘు రెడ్డి , 2.చింత రేవుల గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గౌడ్ , 3.దాసర పల్లె గ్రామ సర్పంచ్ భరత్ లకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని సర్పంచ్ జ్యోతి తెలిపారు.

- Advertisement -