బండ్ల గణేష్‌కు మూడోసారి కోవిడ్ పాజిటివ్..

78
- Advertisement -

టాలీవుడ్‌లో కరోనా కలకలం మళ్లీ మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిన క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతన్నారు. తాజాగాటాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు మరోసారి కరోనా మహమ్మారి సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. రెండోసారి కరోనా సోకడంతో బండ్ల గణేష్‌కు ఆసుపత్రిలో బెడ్ దొరకడం చాలా కష్టమైంది.

మెగాస్టార్ చిరంజీవి మాట చలవతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. అయితే, గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, ఈ సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని బండ్ల గణేష్‌ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

- Advertisement -