- Advertisement -
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రసంగాలపై ఎప్పుడూ ఓ విమర్శ వినిపిస్తూ ఉంటుంది. అదే పవన్ ప్రసంగాలన్నింటికి వెనకలా త్రివిక్రమ్ పెన్ను బలం ఉందని. అయితే ఇది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు. తాజాగా ఈ విషయంపై పవన్ కల్యాణ్ భక్తుడు, బడా నిర్మాత బండ్ల గణేష్ తనదైన స్టయిల్ లో సమాధానం చెప్పాడు. పవన్ విషయంలో తప్పుడు కొడుకులు చేసే ప్రచారమిదంటూ తీవ్రంగా ఖండించాడు.
పవన్ కి రాసి ఇచ్చేవాడు ఇంకా పుట్టలేదని, కావాలంటే ఆయనే వందమందికి రాసిస్తాడంటూ చెప్పుకొచ్చాడు. పవన్ ఇంట్లో సినిమా క్యాసెట్లు, డీవీడీలు ఉండవు.. గది నిండా పుస్తకాలు ఉంటాయని ఆయనకు అన్ని విషయాలపై అవగాహన ఉందంటూ తెలిపాడు. పవన్ – త్రివిక్రమ్ మంచి స్నేహితులు.. వీళ్ల స్నేహాని సహించని వాళ్లే ఇలాంటి ఆరోపణలు చేస్తారంటూ చెప్పుకొచ్చాడు ఈ నిర్మాత.
- Advertisement -