పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ షాకింగ్‌ కామెంట్స్..

58
bandla ganesh
- Advertisement -

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా.. జార్జిరెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చోర్ బజార్. ఈ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మధ్య కామ్ గా ఉన్న బండ్ల.. మరోసారి రెచ్చిపోయారు.

ఈవెంట్ లో బండ్ల మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ పై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. “ఎవరెవరినో స్టార్లను చేశావ్, డైలాగ్స్ రాని వారిని హీరోలుగా పెద్ద స్థాయిలో నిలుచోపెట్టావ్.. నీ కొడుకు విషయంలో మాత్రం ఇలా చేస్తున్నావ్.. నీ కొడుకు ఈవెంట్ కు కూడా రాకుండా ముంబయ్ లో కూర్చున్నావ్ అంటూ బండ్ల చురకలంటించారు.

అంతే కాదు వ్యాంప్ లు వస్తుంటాయి పోతుంటాయి.. కాని కుంటుంబం శాశ్వతం, నేను బ్రతికేది నా కుటుంబ కోసం, నా కొడుకుల కోసం, నా కోసం. మనం ఏం చేసినా.. బిడ్డల కోసమే.. రేపు మనకు తలకొరికి పెట్టేది వాళ్లే.. మనం ఆస్తులు సంపాదించినా.. వాళ్ళ కోసమే.. అప్పులు చేసినా తీర్చేది వాళ్లే.. అన్నా అంటూ పూరీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్.

ఆకాశ్ పూరీలో ఓ స్టార్ ఉన్నాడు.. యాక్టింగ్ ఇరగదీస్తాడు.. ఎవరినో స్టార్లను చేస్తున్నావ్.. నీ కొడుకుని మాత్రం పట్టించుకోవడంలేదు. చూస్తూ ఉండు.. నీ కొడుకు కోసం కథ రాసి.. వాడి డేట్ల కోసం నువ్వు క్యూలో నిల్చునే రోజు వస్తుంది అంటూ పూరీ జగన్నాథ్ ను ఉద్ద్యేశించి బండ్ల గణేష్ మాట్లాడారు.

- Advertisement -