బండ్ల గణేష్..సంచలన వ్యాఖ్యలు

10
- Advertisement -

లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అరవింద్ ఏం చెయ్యడు.. లాస్ట్‌లో వస్తాడు క్రెడిట్స్ వేసుకుంటాడు అన్నారు. అలాగే లిటిల్ హార్ట్స్ సినిమా తీసినందుకు బన్నీ వాసుకు, వంశీ నందిపాటికి అభినందనలు చెప్పారు.

సినీ ఇండస్ట్రీలో పెద్ద మాఫియా ఉంది.. మౌళి జాగ్రత్తగా ఉండు అని హీరోకు సూచించాడు బండ్ల. నువ్వు ఆరు అడుగులు ఉన్నావు.. ఇంకేదో అంటారు.. నువ్వు నమ్మకు అన్నారు.

విజయ్ దేవరకొండ టీషర్టు ఇచ్చాడు…మహేష్ బాబు ట్వీట్ వేశాడు, బండ్ల గణేష్ పొగిడాడు అని గర్వం తెచ్చుకోకు.. లిటిల్ హార్ట్స్ సినిమాకి ముందు ఎలా ఉన్నావో అలానే ఉండు అని సూచించారు బండ్ల గణేష్.

Also Read:Asia Cup:సూపర్-4కు ఆ నాలుగు జట్లు

- Advertisement -