బండి సంజయ్…ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో హాస్యానికి కేరాఫ్‌గా మారింది. ముఖ్యంగా ప్రతీరోజు ఈ సార్ చేసే వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి.జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇన్సూరెన్స్ పేరుతో బండి చేసిన హంగామా తర్వాత నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేయడం ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్ధానాలు గెలిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తాను అనడం అన్ని ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ మంత్రులను,సీఎంను ఇష్టం వచ్చినట్లు తిట్టినా వారు ఈ రాజకీయ అజ్ఞానిని చూసి నవ్వుకొని వదిలేశారు. అంతే ఏదో చూసి ఏదో అనుకున్నట్లు అధికారులపై పడ్డారు బండి. పోలీసులు లేదు,ఐపీఏఎస్‌లు లేదు నోటికి పని చెప్పడంతో ఇప్పుడు బండికి బ్రేక్‌లు పడే పరిస్థితి వచ్చింది. వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్వేరోపై బండి చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీతో పాటు సోషల్ మీడియాలో కాషాయ గుండాలు…స్వేరోపై చేస్తున్న విషప్రచారాన్ని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫాలోవర్సే కాదు గురుకులాల విద్యార్థులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగానే కమలం రెక్కలు విరిగేలా బుద్ది చెబుతున్నారు.
ఇక ఒకడుగు ముందుకేసి నల్గొండలో బండికి చుక్కలు చూపించారు. ప్రవీణ్ కుమార్ సార్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బండి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో ఈ యాక్సిడెంటల్ ఎంపీ షాక్‌కు గురయ్యారు. ఇప్పటివరకు ఏ చిన్న అవకాశం దొరికినా తన నోటిదురుసుతనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బండి.. స్వేరో రూపంలో వచ్చిన ఉహించని పరిణామంతో బిత్తరపోయారు.
స్వేరో ఏ మతానికి చెందింది కాదని అణగారిన వర్గాలకు ఉన్నత చదువు అందించడమే లక్ష్యమని స్పష్టం చేస్తున్న ప్రవీణ్ కుమార్‌పై విమర్శలు చేయడం తగదని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు బీసీగా బలహీనవర్గాల నేతగా తనను తాను ప్రమోట్ చేసకున్న బండి సార్…అదే ఒక ఐపీఎస్ అధికారి ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే విజన్‌తో ఉన్న అధికారిని అణగదొక్కాలనే కుట్ర ఇప్పుడు అందరిని ఆలోచింపచేస్తోంది. దీనికి తోడు సొంతపార్టీ నేతల నుండి చివాట్లు వస్తుండటంతో బండి అండ్ టీమ్ పరిస్ధితిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక తలలు పట్టుకంటున్నారట. మొత్తంగా బండికి స్వేరో రూపంలో గట్టి షాక్ తగలడమే కాదు ఇక ముందు నోరు అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్ధితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుండటం విశేషం.