బండి సంజయ్‌కి ఓటమి ముప్పు?

49
- Advertisement -

తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు భయపడుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు సీట్ల కేటాయింపులో ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు కమలనాథులు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేసే స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసే ఓటమిపాలు అయ్యారు.

ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందినప్పటికి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయితే ఈసారి ఆయన మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల బరిలోనే దిగుతారా ? లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అనే ప్రశ్నకు ఆయనకు సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఈసారి కూడా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేయాలని భావించినప్పటికి అధిష్టానం అందుకు ససేమిరా అంటోందట. బండి సంజయ్ ని ఎలాగైనా అసెంబ్లీ బరిలోనే నిలపలనేది పార్టీ అభిప్రాయంగా తెలుస్తోంది.

Also Read:బిగ్ బాస్ నుండి రాగానే పెళ్లి!

దాంతో తాజాగా తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం కరీంనగర్ లో బండి సంజయ్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పార్టీలో ఉంటున్నప్పటికి జిల్లాలో ఎలాంటి అభివృద్ది పనులు చేయలేదని బండి సంజయ్ పై గుర్రుగా ఉన్నారు అక్కడి ప్రజలు అందుకే అసెంబ్లీ బరిలో నిలిస్తే మళ్ళీ ఓటమి తప్పదనే భయంతో పార్లమెంట్ వైపు చూసినప్పటికి అధిష్టానం ఆదేశాలతో అసెంబ్లీ ఎన్నికల బరిలోనే నిలవక తప్పలేదు. దీంతో బండి సంజయ్ మరోసారి ఓటమి చవిచూడడం ఖాయంగా తెలుస్తోంది.

Also Read:ప్రజలకు డబ్బు పంచిన ఏకైక హీరో

- Advertisement -