బండి సంజయ్.. ఇకనైనా మారవా?

60
- Advertisement -

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు, విమర్శలు తరచూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. చెప్పే విషయాలపై ఎలాంటి స్పష్టత లేకుండా విమర్శలు గుప్పించడం బహుశా బండి సంజయ్ కే చెల్లిందేమో. ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడూ మసీదులు కూల్చుదాం సమాధులు తవ్వుదాం అంటూ ఏ స్థాయిలో మత విద్వేషాలకు తవిచ్చారో అందరికీ తెలిసిందే. ఇక ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళల పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.

Also Read:మోడీ రాక.. రాజకీయం కోసమేనా?

నిత్యం కే‌సి‌ఆర్ పై విమర్శలు గుప్పించడం తప్పా కేంద్ర నిధుల ప్రస్తావనపై ఏనాడూ నోరు మేడపలేదు బండి సంజయ్. ఇదిలా ఉంచితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ పెద్దల కాళ్ళ వద్ద ఉంచుతూ వారి కాళ్ళకు చెప్పులు వేయడం వంటి పరిణామలు గమనిస్తే.. బండి సంజయ్ వ్యవహార శైలి పదవుల కోసమే అన్నట్లుగా ఉందని ప్రజలు కూడా ఓ అంచనాకు వచ్చేశారు. ఇక బహిరంగ సభలలోనూ కేంద్ర పెద్దలకు భజన చేయడం తప్పా రాష్ట్ర ప్రయోజనాలపై, బండి సంజయ్ అసలు మాట్లాడారనే విమర్శ ఉంది.. దీంతో బండి వ్యవహార శైలి గమనించిన బీజేపీ పెద్దలు అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించారనే చెప్పవచ్చు. ఇక తాజాగా వరంగల్ కు మోడీ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా బండి సంజయ్.. బీజేపీ పెద్దలపై పొగడ్తలు తప్పా.. వేరే ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో పదవి పోయిన భజన మాత్రం మానవా అంటూ బండి సంజయ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు సామాన్యులు.

- Advertisement -