బీజేపీ స్వార్థ రాజకీయం..’బండి’నే నిదర్శనం!

45
- Advertisement -

దేశ పాలనలో రాజకీయ నాయకులదే కీలక పాత్ర.. దేశం అభివృద్ది పథంలో నడవాలన్న.. దేశం నాశనం కావాలన్న పొలిటీషియన్స్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల సరైన నాయకుడికి అధికారాన్ని కట్టబెట్టడం ప్రజల బాద్యత.. ఇదిలా ఉంచితే నేటి రోజుల్లో రాజకీయ నాయకులు కేవలం వారి స్వలాభం కోసమే అధికారం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ది చేస్తామో చెప్పకుండా.. వారి అధికార దాహం కోసం ప్రజా జీవితలను తప్పు త్రోవ పట్టిస్తున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటారా ? ఇటీవల బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పైన చెప్పిన వాక్యాలు నిజమే అని చెప్పక తప్పదు.

మరో ఎనిమిది నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని, ఈ ఎనిమిది నెలలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు.. పక్కన పెట్టి బీజేపీకి మద్దతు తెలపాలని వ్యాఖ్యానించారు. అంటే వారి అధికారం కోసం ప్రజా జీవితలను పణంగా పెట్టండి అనే అర్థం వచ్చేలా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్రంగా ఫైర్ అవుతుననృ. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు కొంతమంది. .

మీరు అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఏం చేస్తారో చెప్పకుండా ఇలా ఉద్యోగాలు మానేయండి, చదువులు మానేయండి అంటూ చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారికి అధికారం ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లేనని మరికొందరు వ్యగ్యస్త్రాలు సందిస్తున్నారు. అయితే బండి సంజయ్ గతంలో కూడా చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొడుతూ అనేక సందర్భాలలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి. బీజేపీ అధిష్టానం కాళ్ళకు చెప్పులు తొడిగే ఇలాంటి బండి సంజయ్ లను తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం లేదనేది అందరికీ తెలిసిన విషయం. మొత్తానికి బీజేపీ స్వార్థ రాజకీయాలకు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పక తప్పదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -