ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ బీజేపీలో అనిశ్చితి పెరుగుతోంది. కర్నాటక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తెలంగాణలో ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. అంతే కాకుండా పార్టీలో అసమ్మతి సెగలు, నేతల మధ్య విబేదాలు.. పార్టీ నుంచి వీడేందుకు సిద్దమౌతున్న నేతలు.. ఇలా ఒక్కటేంటి ఎన్నో సమస్యలు బీజేపీని వేధిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉంటున్నారట. పార్టీలో ఎవరికి సరిగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని బండి పై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట. .
దాంతో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి తప్పించాలనే డిమాండ్ ఎక్కువగా అధిష్టానం ముందు వినిపిస్తోందట. ఇక అలాగే ఈటల రాజేందర్, మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో వీరిద్దరు పార్టీ వీడే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో వీరిద్దరితో అధిష్టానం ఇటీవల భేటీ కూడా అయింది. ఈ భేటీలో ఎలాంటి చర్చలు జరిగాయనే దానిపై క్లారిటీ లేనప్పటికి.. వీరిద్దరితో భేటీ ముగిసిన రెండో రోజుకే ( నేడు ) బండి సంజయ్ కి అధిష్టానం నుంచి పిలుపు రావడం.. ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: విపక్షాలకు బిఆర్‌ఎస్ దూరం..కారణం అదే!
ఆ మధ్య అధిష్టానంతో భేటీ అయిన ఈటల, కోమటిరెడ్డి.. బండి సంజయ్ పై ఏమైనా కంప్లెంట్ చేశారా ? ఏ విషయంపై ఢిల్లీ అధిష్టానం నుంచి బండికి పిలుపు వచ్చింది ? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ మధ్య ఈటల, కోమటిరెడ్డి పార్టీ వీడడంపై ” ఉండే వాళ్ళు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు అనే రీతిలో బండి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో అధిష్టానం బండి కి మొట్టికాయలు వేయబోతుందా అనే చర్చ కూడా నడుస్తోంది. బండి సంజయ్ కి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో తెలంగాణ తెలంగాణ బీజేపీలో ఏమైనా మార్పులు చోటు చేసుకొనున్నాయా అనేది చూడాలి.
Also Read: రాహుల్ నాయకత్వంపై డౌటే ?