అభివృద్ధిలో భాగస్వామినవుతా:బండి

3
- Advertisement -

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్. కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన బండి..తాను ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు.

తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని… తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు… ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల నుండి మోడీ కేబినెట్‌లో ఐదుగురికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఏపీ నుండి ముగ్గురుకి , తెలంగాణ నుండి ఇద్దరికీ ఛాన్స్ దక్కింది. కిషన్ రెడ్డికి మరోసారి కేంద్రమంత్రి పదవి దక్కగా బండి సంజయ్‌ కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Also Read:సన్ ఫ్లవర్ విత్తనాలతో ఎన్ని ప్రయోజనాలో?

- Advertisement -