బండి ఒక రాజకీయ ఆజ్ఞాని: కేటీఆర్‌

20
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రాజకీయాల కోసమే యువతను పెడదారిన పెట్టేందుకు సంజయ్ పనిచేస్తున్నారని అన్నారు. అయనొక తెలివిలేని దద్దమ్మ, రాజకీయ ఆజ్ఞాని అని అన్నారు. టీఎస్‌పీఎస్సీ ఒక రాజ్యంగ స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ అని గుర్తు చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వంకు సంస్థకు ఏలాంటి సంబంధం లేదని అన్నారు.

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలియ‌కుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం.. బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్‌ తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఅర్ తెలిపారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే 8 సంవత్సరాలలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై ఏమంటావని బండి సంజయ్‌ని సూటిగా నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో సిట్‌ను నియమించి.. బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని తెలిపారు. ప్రభుత్వం పారదర్శక తీరును పట్టించుకోకుండా కేవలం మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.

తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలన్న సమున్నతమైన ఆశయంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిందని, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి తెలిపారు. ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా, అవసరమైన కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అందిస్తామని కేటీఆర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి…

వైరల్ అవుతున్న రాహుల్‌ కామెంట్‌..!.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు..టీఎస్‌పీఎస్సీ

1980ల నాటి మిలిటరీ హోటల్ ప్రారంభం..

- Advertisement -