- Advertisement -
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తకి ఫోన్ చేసి అభినందించారు.కరోన కష్ట కాలంలో ఉప్పల శ్రీనివాస్ గుప్త చేస్తున్న సేవా కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని, కష్ట కాలంలో పేదల కోసం ఆలోచించే మనస్తత్వం ఉండటం ఎంతో అభినందనియం అని దత్తాత్రేయ కొనియాడారు.కరోన కట్టడి కోసం శ్రీనివాస్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ప్రతి రోజు 2000 మందికి భోజనాలు, 300 మందికి నిత్యవసర సరుకులు అందించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.పోలీసులు,పారిశుధ్య కార్మికులు,డాక్టర్లు,జర్నలిస్టులకు పిపిఈ కిట్లు ఇవ్వడం గర్వించదగ్గ విషయం అన్నారు.ఉప్పల శ్రీనివాస్ గుప్త కుటుంబ సభ్యులని,అన్ని జిల్లాల ఐవిఎఫ్ ప్రతినిధులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు.
- Advertisement -