పార్టీ అద్యక్షులు కేసీఆర్,వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించి రైతులకు సంఘీభావం తెల్పాలని టిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు,జెడ్పీ ఛైర్మెన్, బండా నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. సోమవారం నల్లగొండలోని జెడ్పీ అతిధి గ్రుహంలో రైతు బంధు సమితి జిల్లా అద్యక్షుడు రాంచంద్ర నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్‌లతో కలిసి బండా నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ రైతులు ఆర్దికంగా నిలదొక్కుకుంటున్నారని, ఈ సమయంలో మోదీ తెచ్చిన రైతు చట్టాలు రైతుల పాలిట శరాఘాతంలా మారాయని నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్దితిల్లో కేంద్ర చట్టాలను ఒప్పుకునేది లేదని, చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రేపటి బంద్‌లో ప్రతి కార్యకర్త, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాపార వాణిజ్య సముదాయలు, సబ్బంఢ వర్గాలు బంద్‌లో పాల్గొని రైతులకు అండగా నిలవాలని కోరారు.
ఇక రైతు బంధు సమితి జిల్లా అద్యక్షుడు రాంచంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 8న భారత్ బంద్‌లో రైతు బంధు సబ్యులు అంతా ఎక్కడివారక్కడే పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెట్ లను నిర్వీర్యం చేస్తూ, కార్పోరేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయం బందీ అయ్యేలా మోదీ సర్కార్ కుట్ర పూరితంగా తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మిడియా సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అద్యక్షుడు మైనం శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.