కోమటిరెడ్డి సోదరులకు మరో షాక్ తగిలింది. స్ధానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ నుంచి బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీపై టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ఘనవిజయం సాధించారు. సిట్టింగ్ స్ధానాన్ని కొల్పోవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నిరాశే మిగిలింది. తాజాగా పరిషత్ ఎన్నికల్లో మరోసారి ఉహించని షాక్ తగిలింది.
నార్కట్‌పల్లిలో 11 ఓట్ల తేడాతో కోమటిరెడ్డి మోహన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్ధి బండ నరేందర్ రెడ్డి గెలుపొందారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వరుసగా షాక్‌లు తగులుతుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కోమటిరెడ్డి బ్రదర్స్‌కే కాదు నల్గొండ జిల్లాలో సీనియర్ నేతలకు సైతం పరాభవం తప్పలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లో రెండు జడ్పీటీసీ, నాలుగు ఎంపీపీలను దక్కించుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్‌లో రెండు జడ్పీటీసీలను, ఒక మండల పరిషత్‌ను, మాజీ మంత్రి, ఇటీవల ఎంపీగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డ%