అరటిపండు అతిగా తింటే ప్రమాదమే!

35
- Advertisement -

చాలమందికి ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటుంది. కొందరైతే సమయాభావం లేకుండా అరటిపండు తింటూ ఉంటారు. అరటిపండు తినడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. లాభాల విషయానికొస్తే అరటిపండ్లలో వివిధ రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, బి, సి వంటివి అధికంగా ఉంటాయి. ఇంకా పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి మూలకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా అరటిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఇంకా ఇందులో పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఇంకా అరటిలో ఉండే క్యాలరీల కారణంగా తక్షణ శక్తి లభిస్తుంది. అయితే అరటిపండు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటిని అతిగా తింటే ప్రమాదమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో సహజంగానే చక్కెర శాతం అధికంగా ఉంటుంది కాబట్టి కాబట్టి మధుమేహ తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా అరటిపండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులోని పొటాషియం కారణంగా మూత్ర విసర్జనలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇంకా ఆస్తమా, గురక వంటి సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తక్కువగానే తినాలి. లేదంటే కఫం ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా పడగడుపున అరటిపండు అసలు తినకూడదు. ఒకవేళ పడగడుపున తింటే మలబద్ధకం సమస్య పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉదర సంబంధిత సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అరటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:టీఎస్‌పీఎస్సీ పదవులకు భారీ దరఖాస్తులు..

- Advertisement -