ప్లాస్టిక్ నియంత్రణలో పౌరులు కూడా భాగస్వాములు కావాలి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇస్తున్నాం కానీ గ్రౌండ్ లో ప్రజలకు అవగాహన ఉండడం లేదు అన్నారు.
మన డే టు డే లైఫ్ లో ప్లాస్టిక్ అనేది అంతర్భాగం అయిపోయి సౌకర్యం ఇస్తుంది కానీ తర్వాత పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది అన్నారు. దీనిపై స్పందించారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు.
ప్లాస్టిక్ నిషేధించండి అని జనసైనికులకు ఒక్కసారి మీ స్టైల్ లో చెప్పండి అని పవన్‌కు సూచించారు. వాళ్లే చూసుకుంటారు… గతంలో రోడ్లు పూడ్చండి అని మీరు పిలుపిస్తే ఎలా పూడ్చారో ఇప్పుడు కూడా అలాగే ప్లాస్టిక్ ని నిషేధిస్తారు అని చెప్పారు.
Also Read:బండ్ల గణేష్..సంచలన వ్యాఖ్యలు
ప్లాస్టిక్ ఉత్పత్తులు అరికట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం.. సచివాలయంలో మొత్తం ప్లాస్టిక్ నిషేదించాం.. గాజు సీసాల్లో నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం.. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. భూమిలో ప్లాస్టిక్ పూర్తిగా కలవడం లేదు.. తల్లిపాలలో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది.. తిరుమలలో ప్లాస్టిక్ ఫ్రీ కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం అన్నారు పవన్.

