iPhone 17: బారులు తీరిన యువత!

7
- Advertisement -

ఐ ఫోన్ 17 కోసం దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్స్ వద్ద యువత బారులు తీరింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా iPhone 17 అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఊహించినట్లుగానే, Apple అభిమానులు కొత్తగా విడుదలైన iPhones‌ను పొందడంలో ఉత్సాహంగా కనిపించారు.

ఈ సిరీస్‌లో iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone Air ఉన్నాయి. ఇవన్నీ iOS 26తో కలిసి iPhone అనుభవాన్ని మరింత ప్రీమియంగా మార్చేలా అనేక అప్‌గ్రేడ్స్‌తో వచ్చాయి.

ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో Apple Stores బయట ఉదయం నుంచే పెద్ద క్యూలు కనిపించాయి. ఆన్‌లైన్ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ఈ కొత్త iPhone లాంచ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రిటైలర్లు భారత మార్కెట్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విభిన్న ఆఫర్లు ఇస్తున్నారు. Reliance Digital, Croma వంటి స్టోర్లు బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు ఇస్తున్నాయి.

ముంబైలోని BKC లో గంటల తరబడి క్యూలో ఉన్న యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. స్టోర్ బయట కొట్టుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డులు కంట్రోల్ చేశారు. అటు బెంగళూరులోనూ ఈ లగ్జరీ ఫోన్ల కోసం యువత ఎగబడ్డారు

Also Read:బండ్ల గణేష్..సంచలన వ్యాఖ్యలు

iPhone 17, iPhone 17 Pro, iPhone Air ధరలు (భారత్‌లో)

iPhone 17

256GB: ₹82,900

512GB: ₹1,02,900

iPhone Air

256GB: ₹1,19,900

512GB: ₹1,39,900

1TB: ₹1,59,900

iPhone 17 Pro

256GB: ₹1,34,900

512GB: ₹1,54,900

1TB: ₹1,74,900

iPhone 17 Pro Max

256GB: ₹1,49,900

512GB: ₹1,69,900

1TB: ₹1,89,900

2TB: ₹2,29,900

- Advertisement -