#బాలుగీత..డిసప్పాయింట్ చేయదు!

2
- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం #బాలుగీత. సందీప్ సరోజ్, కేయురి, హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు. ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్ సహా నిర్మాతలు. నవంబర్ 5 నుంచి ఈ చిత్రం ETV Winలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్‌మీట్‌లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.చిన్న సినిమా అంటాం కానీ, చాలా పెద్ద కథ. ఈ కథ చెప్పినప్పుడు ఎలాగైనా సరే దీన్ని సినిమాగా తీయాలి అనిపించింది. అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. ETV అనేది మంచి కంటెంట్ అందించే ప్లాట్‌ఫామ్. అన్నపూర్ణ నుంచి మేము ఈ కథ చెప్పగానే బాపినీడు గారు వెంటనే చేసేద్దాం అన్నారు. ఆయన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. చాలా యంగ్ టాలెంట్‌తో చేసిన సినిమా ఇది.

హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నిహారిక గారికి ధన్యవాదాలు. నన్ను పరిచయం చేసిన ప్రొడ్యూసర్ నిహారిక గారు. ఆమె సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సుప్రియ గారితో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇద్దరూ చాలా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కమిటీ కుర్రోళ్లు’లో నటించిన నటీనటులు వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు వాళ్ల ఈవెంట్స్‌కు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. నన్ను ఈవెంట్‌కు ఇన్వైట్ చేసిన సందీప్‌కు థాంక్యూ. ఈ ట్రైలర్ నేను చూశాను. చాలామందికి ట్రైలర్ గురించి చెప్పాను.

Also Read:‘ఇట్లు అర్జున’ కోసం ఎన్టీఆర్..!

హీరోయిన్ కేయురి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందరూ రిలేట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాను నవంబర్ 5న ETV Winలో చూడాలని కోరుతున్నాను..సహ నిర్మాత హరీష్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. ఈ కథ అందరి దగ్గర సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే అయింది. చాలా అద్భుతమైన టీమ్‌తో కలిసి సినిమా చేశాం. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్‌కు, సుప్రియ మేడమ్‌కు ధన్యవాదాలు. ఇది తప్పకుండా అందరికీ రిలేట్ అయ్యే కథ. నవంబర్ 5న ETV Winలో మీరందరూ చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

- Advertisement -