రేవంత్‌ రెడ్డిపై బాల్క సుమన్‌ ఫైర్‌..

359
MLA Balka Suman
- Advertisement -

కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన బాల్క సుమన్ ఈ రోజు టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి నిరాధారఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారు.గోపన్ పల్లిలో దళితుల భూములను లాక్కున్న వ్యక్తి రేవంత్. దానిపై ఇప్పటి వరకు మాట్లాడటం లేదు అని సుమన్‌ విమర్శించారు.

ఎదుటి వాడిపై బురద జల్లటం రేవంత్‌ రెడ్డికి అలవాటే.111 జీవో పరిధిలోని వట్టి నాగులపల్లిలో రేవంత్ బాగోతం బయట పెడుతున్నది. సర్వే నెంబర్ 66/ఈ లో రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాష్ రెడ్డి అక్రమ కట్టడాలు కడుతున్నారు.వీటిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ఎవరెవరికి 111 జీవో పరిధిలో భూములున్నాయో… బయట పెడతాం. రేవంత్ చూపెట్టిన భూములు కేటీఆర్ వి కావు అన్నారు.

కాంగ్రెస్ నాయకులు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు.కేటీఆర్‌ ఎదుగుదలను కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారు.రేవంత్ వ్యవహారాలు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. వట్టి నాగులపల్లిలో నీ పేరు..మీ బంధువుల పేర్ల మీద ఉన్న భూములపై ముందు సమాధానం చెప్పు అని బాల్క సుమన్‌ ప్రశ్నించారు.

- Advertisement -