కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. నేడు(గురువారం) టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన సుమన్.. రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాల కోరని అన్నారు. తెలంగాణ సర్కారుపై బురదజల్లేందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న సుమన్..రేవంత్ ఏ మాత్రం విశ్వశనీయత లేని వ్యక్తని, రేవంత్ ఓ గజదొంగని అన్నారు.
రేవంత్ కాంగ్రెస్‌పార్టీలో ఎన్ని రోజులుంటాడో ఆయనకే తెలీదని, తానకు తానుగా రేవంత్ అతిగా ఊహించుకుంటున్నాడని సుమన్ ఎద్దేవా చేశారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు వస్తే..విద్యుత్ లెక్కలు సవివరంగా తెలిపేందుకు సిద్దంగా ఉన్నామన్నారు సుమన్ . రాజీనామా చేశానని చేప్పి..ఆ లేఖను స్పీకర్‌కు పంపని అబద్దాలకోరు రేవంత్ అని..అలాంటి వక్తి ఏ హోదాతో చర్చకు వస్తాడని ఎంపీ సుమన్ ప్రశ్నించారు . రేవంత్ రెడ్డికి చేతనైతే..జానారెడ్డిని,ఉత్తమ్ కుమార్ రెడ్డిని చర్చకు పంపాలని అన్నారు.
దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని, చీప్ పబ్లిసిటీ కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి కాదు.. విశ్వశనీయత ఉన్న వ్యక్తులే చర్చకు రావాలని కోరారు.
ఈ క్రమంలోనే… ‘కరెంట్ పై చర్చకు జానారెడ్డి..వస్తాడా.. ఉత్తం కుమార్ రెడ్డి వస్తాడా…? అని మేం సవాల్ చేశాం..దానిపై వాళ్ళిద్దరూ స్పందించకుండా రేవంత్ రెడ్డి దొంగలాగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిండు’ అని విమర్శిచారు బాల్క సుమన్. కాగా… సోలార్ విద్యుత్ పై కోమటిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సోలార్ విద్యుత్‌కు ఉమ్మడి సర్కారులో పక్కరాష్ట్రం కర్ణాటక కంటే తక్కువ ధరకే చెల్లిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారని…సీఎం నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని..కరెంట్ కోసం ధర్నాలు జరిగిన ధాకలాలు లేవని స్పష్టంచేశారు బల్క సుమన్.