అభిమానుల కాళ్ళు పట్టుకున్న స్టార్‌ హీరో..!!

246
Actor Surya Touching His Fan Feet
- Advertisement -

సాధారణంగా మనం అమితంగా అభిమానించే వ్యక్తి కనబడితే..ఆ అభిమానాన్ని చాటుకునే క్రమంలో వారి కళ్ళకు నమస్కారం చేస్తుంటాం. ఎక్కువగా ఇలాంటివి గురువుల విషయంలో జరుగుతుంటాయి. ఒక్కోసారి సినీ స్టార్ల విషయంలోనూ జరుతుంటాయి.

 Actor Surya Touching His Fan Feet
అయితే తాము అభిమానించే హీరోను కలుసుకునేందుకు వేదిక మీద‌కి ఒక్క‌సారిగా వ‌చ్చిన అభిమానులు… హీరో సూర్య పాదాల‌కు న‌మ‌స్కారం చేశారు. దీంతో కాస్త ఇబ్బంది పడిన సూర్య వెంటనే వారి కాళ్లకు కూడా నమస్కరించారు. ఈ ఘ‌ట‌న సూర్య కొత్త చిత్రం ‘గ్యాంగ్‌’ త‌మిళ ప్రీ రిలీజ్ వేడుక‌లో జ‌రిగింది. ఈ దృశ్యాన్ని కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. సూర్య తన అభిమానుల కాళ్లకు నమస్కరించడం చూసి అక్కడున్న వారు ఒక్కసారిగా షాకయ్యారు.

అయితే ఇక్కమరో విషయాన్ని గుర్తుచేసుకోవాల్సిందేంటంటే…అభిమానుల‌ను ఆద‌రించ‌డంలో త‌మిళ హీరోలు మిగ‌తా భాష‌ల సినీ హీరోల‌తో పోల్చితే ఒక అడుగు ముందే ఉంటారు. అభిమానం త‌ట్టుకోలేక ఒక్క‌సారిగా త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన వారిపై చిరాకు ప‌డ‌కుండా ప్రేమ‌గా ఆద‌రిస్తుంటారు. విక్ర‌మ్ ఓ అభిమానిని కౌగిలించుకోవ‌డం, అభిమాని అంత్య‌క్రియ‌ల‌కు న‌టుడు కార్తీ హాజ‌రై ఏడ‌వ‌డం ఇలా చాలా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

- Advertisement -