కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,బీజేపీ నేత లక్ష్మణ్‌లపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ వి .గంగాధర్ గౌడ్. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన వారు సీఎం కెసిఆర్ పై ఇష్టారీతిన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగం గా నిర్మాణం కావడాన్ని కాంగ్రెస్ ,బీజేపీ నేతలు ఓర్చుకొలేక పోతున్నారు ..వారి కడుపు మండుతోంది …లక్ష్మణ్ కాళేశ్వరానికి అనుమతులిచ్చింది కేంద్రప్రభుత్వమే అంటున్నారు ..తెలంగాణ దేశం లో అంతర్భాగం కాదా ?అనుమతులు ఇచ్చి తీరాల్సిందే ఎందుకు ఇవ్వరు ?అని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత శరవేగంగా కట్టిన ప్రాజెక్టు ఏదయినా ఉందా లక్ష్మణ్ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం నయా పైసా ఇవ్వలేదని కెసిఆర్ నిజం చెబితే బీజేపీ కి ఎందుకు ఉలికి పాటు ?…సహనం కోల్పోయి మాట్లాడుతోంది సీఎం కెసిఆర్ కాదు బీజేపీ నేతలే
…నిజాలు నిజాలు గా మాట్లాడితే బీజేపీ కి మంచిదని సూచించారు.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కి అవగాహనా లేకే కాళేశ్వరం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తుమ్మిడి హట్టి కంటే మేడి గడ్డ దగ్గరే నీటి లభ్యత ఎక్కువ ఉందని కేంద్రజలసంఘం చెప్పిన విషయాన్ని జీవన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. అంచనా వ్యయం పెంపు పై కూడా జీవన్ రెడ్డి ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు …ఆయకట్టు భారీ గా పెరిగింది కనుకే అంచనా వ్యయం పెరిగింది
…కేంద్రం ,ఏపీ ,మహారాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా సాగునీటి ఒప్పందాలు కుదుర్చుకొలేక పోయారని చెప్పారు.
కాంగ్రెస్ హాయంలో ప్రాజెక్టులంటే పెండింగ్ ..కెసిఆర్ హాయం లో ప్రాజెక్టులంటే రన్నింగ్ …కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తాయి ..ఇక కాంగ్రెస్ ,బీజేపీ నేతలకు కన్నీళ్లు తప్పవు …కేవలం అసూయ ,ద్వేషాలతోనే మాట్లాడుతున్న కాంగ్రెస్ ,బీజేపీ నేతల కు తెలంగాణ రైతుల నుంచి ఆగ్రహం తప్పదు
…అపర భగీరథుడు కెసిఆర్ ను తెలంగాణ రైతులు ఎపుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు.
కాళేశ్వరం గురించి ప్రతిపక్షాలు పాజిటివ్ మైండ్ సెట్ అలవర్చుకుంటే మంచిది …మూస రాజకీయాలు ,రొటీన్ విమర్శలు మానుకుంటే కాంగ్రెస్,బీజేపీ నేతలకు మంచిది …ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సాగునీటి ప్రాజెక్టుల విషయం లో కెసిఆర్ సత్సంబంధాలు నెలకోల్పుతున్న తీరు దేశానికే రోల్ మోడల్ …రామేశ్వరం పోయినా శనీశ్వరులు తప్పరన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చే సందర్భం లో కాంగ్రెస్ ,బీజేపీ శనీశ్వరుల మాటలు వినక తప్పడం లేదన్నారు.
కాళేశ్వరం కోసం శ్రమించిన ఇంజినీర్లకు ,భూములిచ్చిన రైతాంగానికి పాదాభివందనం చేస్తున్నా అన్నారు.కొత్త సచివాలయం ,అసెంబ్లీ కట్టుకోవడం కూడా తప్పే అన్నట్టు కాంగ్రెస్ ,బీజేపీ నేతలు మాట్లాడుతుండటం దుర్మార్గమన్నారు.తెలంగాణ కు అద్భుతమైన సచివాలయం ,అసెంబ్లీ ఉండటం మన రాష్ట్రానికి గర్వకారణం …ఇకనైనా కాంగ్రెస్ ,బీజేపీ నేతలు అవాస్తవాలు మాట్లాడటం మానుకోవాలి
…సాగునీటి కోసం అనేక రాష్ట్రాలు తగువు పడుతున్న పరిస్థితుల్లో కెసిఆర్ దేశానికి తన తీరు తో దిక్సూచి లా మారారు …శాసన సభ ,మండలి లను ఓ అధ్యయన ,పరిశోధన కేంద్రంలా మార్చాలని కెసిఆర్ ఓ విజనరీ లా ఆలోచిస్తున్నారని చెప్పారు.
బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందంటున్నారు .అలాంటపుడు కేంద్రం ప్రాజెక్టు కు అనుమతులు ఎందుకు ఇచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలన్నారు.నోరుతో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించేలా బీజేపీ తీరు ఉందన్నారు.