ప్రశ్నించే గొంతుకలపై దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సుమన్..జర్నలిస్ట్ శంకర్‌పై కాంగ్రెస్ గుండాల దాడిని అందరూ ఖండించాలన్నారు.అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేస్తారా…దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
శంకర్ పై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త సాయిరాం రెడ్డి అని సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మూడు నెలలు కాకముందే కాంగ్రెస్ పాలనలో అనేక ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నయా దేశ్‌ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో దళిత బహుజన జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని..ఈ ఘటనలో పోలీసుల ఓవరాక్షన్ సరికాదన్నారు. ఇలాంటి పాశవిక హింసాత్మక ధోరణిని రేవంత్ ఇప్పటికైనా మానుకోవాలి అని ఫైర్ అయ్యారు సుమన్.
Also Read:జగన్ పై పోటీ.. రవి గెలిచేనా ?