దసరా ముందుగానే వచ్చింది:కొప్పుల,బాల్క

634
cm kcr
- Advertisement -

రాష్ట్రంలో అతిముఖ్యమైన సంస్థ సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బావులతో ప్రతిఏటా సింగరేణి లాభాలు గడిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన కొప్పుల 2019 – 20 సంవత్సరం కు లాభాలు సాధించిందని…లాభాలలో వాటా కార్మికుల కు అందజేయడం జరుగుతుందన్నారు.

ఈసారి వచ్చిన లాభాలను కార్మికుల కు పంచాలని సభలో వెల్లడించడం జరిగిందని… కార్మికుల పక్షణా, మా తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కార్మికునికి 1 లక్ష 899 రూపాయలు ఇస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ …ఈ లాభాలను దసరా పండగ రోజున ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ కు కొంగు బంగారం అయినటువంటి సింగరేణి సంస్థను మొదటి నుండి మంచి పనులు చేస్తూ పోతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. తెలంగాణ బిడ్డనే సింగరేణి సంస్థ కు డైరెక్టర్ గా నియమించారు..సింగరేణి సంస్థ లో లాభాలు గతం కంటే ఎక్కువ లాభాలు వచ్చాయి అందుకు అనుగుణంగా ఇవ్వాళ లాభాల వాటాను 28 శాతం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సభలో వెల్లడించారని చెప్పారు.

దసరా పండగ ఇవ్వాలనే వచ్చినట్లు అనిపిస్తుంది..ఒక్కో కార్మికునికి 1 లక్ష 899 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయింపు ఇవ్వాలని తీర్మానం చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అయంలో డిపెండెంట్ ఉద్యోగాలు తీసివేశారు కానీ మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పునరుద్ధరణ చేశామని తెలిపారు. కొంత మంది కోర్టు కు పోతే మళ్ళీ కారుణ్య ఉద్యోగలు ఇవ్వటం జరిగింది..కార్మికుల తల్లిదండ్రులకు జబ్బులు వస్తే హైదరాబాద్ లో ఉన్న కార్పోరేట్ దవాఖాన కు వచ్చే వెసులుబాటు కల్పించారని చెప్పారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అంతేకాదు సింగరేణి కార్మికులకు అండగా ఉండే ముఖ్యమంత్రి అని చెప్పారు బాల్క సుమన్.

- Advertisement -