మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బాల్క సుమన్. చెన్నూరు నియోజకవర్గంలో కొత్తరోడ్లకు సంబంధించి జరిగిన ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ సూపరిండెంటింగ్ ఇంజనీరు ఐ రమేష్ ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకాష్ జాదవ్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం స్వామిరెడ్డి ,అసిస్టెంట్ ఇంజనీర్ రాజమౌళి పాల్గొనగా 11 రోడ్లకు గాను ప్రతిపాదనలు చేయడం జరిగింది.
1)భీమారం నుండి కిష్టంపేట వయా కొత్తపల్లి వరకు బ్రిడ్జ్ర్ తో సహా 23 కి.మీ.
2) R&B రోడ్డు నుండి దుగ్నేపల్లి వయా నారాయణపూర్ వరకు బ్రిడ్జ్ తో సహా 6 కి.మీ.
3)R&B రోడ్డు నుండి చింతపల్లి వరకు బ్రిడ్జ్ర్ తో సహా 4 కి.మీ.
4) SH1 రోడ్డు పులిమడుగు నుండి ACC రోడ్డు మంచిర్యాల వయా బొక్కలగుట్ట వరకు బ్రిడ్జ్ర్ తో సహా 8 కి.మీ
5) ZP రోడ్డు సండ్రోన్ పల్లి నుండి మందమర్రి వయా శంకర్ పల్లి వరకు బ్రిడ్జ్ర్ తో సహా 6 కి.మీ
6) R&B రోడ్డు 10/0 కి.మీ నుండి పొన్నారం వయా బీరవేల్లి,నాగపూర్ వరకు 16 కి.మీ
7) NH 63 నుండి రసూల్ పల్లి నుండి గుడిపెల్లి వరకు 7 కి.మీ
8) మందమర్రి నుండి ఆవడం వరకు 15 కి.మీ
9) PR రోడ్డు ఆరేపల్లి నుండి సుద్దాల వయా ఎల్కేశ్వరం మరియు LB పేట్ వరకు 8 కి.మీ
10) బూరుగుపల్లి నుండి ధర్మారం వయా దాంపూర్ వరకు 7 కి.మీ
11) R&B రోడ్డు నుండి గెర్రెగూడెం వయా నర్సింగపూర్ గోత్రాల వాడ వరకు 3 కి.మీ ప్రతిపాదనలు చేయడం జరిగింది.
ఇందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో గల పలు వాగులపైన బ్రిడ్జ్ లు లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా అందులో ముఖ్యమైన 5 బ్రిడ్జ్ లకు సైతం ప్రతిపాదనలు చేశారు.
1) చెన్నూరు మండలం సుద్దాల వాగు పైన
2) చెన్నూరు మండలం కత్తరశాల వాగు పైన
3) చెన్నూరు మండలం అక్కేపల్లి వాగు పైన
4) మందమర్రి మండలం పులిమడుగు వద్ద గల రాళ్ళ వాగు పైన
5) మందమర్రి మండలం శంకర్ పల్లి వద్ద గల పాలవాగు పైన మొదలైన వాటికి ప్రతిపాదనలు చేయగా వీటికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు బాల్క సుమన్.