లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి..

80
Balka Suman

చెన్నూర్ నియోజకవర్గంలోని లక్షా ముప్పైఅయిదు వేల ఎకరాలకు మూడు లిఫ్టుల ద్వారా సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనుల పురోగతికి సంబంధిoచి అధికారులు ఏజెన్సీలతో ప్రభుత్వ విప్ ,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ 7 కోట్లతో చేపట్టిన సర్వే పనుల పురోగతిపై విప్ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొంత సర్వే పని మిగిలి ఉన్నదని.. వర్షాలు తగ్గుముఖం పట్టినందున త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో సర్వే పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు పాలనా పరమైన అనుమతులు పొంది పనులు మొదలైయ్యేలా చూస్తామని విప్ ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ రైతుల చిరకాల వాంఛ అయిన సాగునీటిని అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ CE శ్రీనివాస రెడ్డి , SE విష్ణు ప్రసాద్ , EE శ్రీనివాస్ రెడ్డి మరియు ఏజెన్సీ అధికారులు పాల్గొన్నారు.