జేఏసీ అధ్యక్షుడు కోదండరాంపై ఎంపీ బాల్కసుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని….ఆయన సోనియా గాంధీని కలవాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ములేక…కోదండరాం కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు.
ఉద్యమకారుని ముసుగులో ప్రభుత్వంపై దాడి చేయడం సరికాదని సూచించారు సుమన్. కోదండరాం అనే ద్రోహిని ప్రజలు నమ్మవద్దని కోరారు సుమన్. ఇప్పటికైనా ఇలాంటి కుట్రలు మానాలని…లేకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కోదండరాంకు దమ్ముంటే కాంగ్రెస్ కండువా వేసుకొని విమర్శలు చేయాలన్నారు. మల్లన్న సాగర్ పై రైతులను రెచ్చగొడుతున్నారని….చచ్చిపోయిన కాంగ్రెస్‌ను బతికించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు.
జూలై 16,27 తేదీలలో సోనియాతో సమావేశం తర్వాతనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని….అద్దంకి దయాకర్,కత్తి వెంకటస్వామికి టికెట్ ఇప్పించింది కోదండరాం అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కోదండరాం నిజస్వరూపాన్ని గమనిస్తున్నాని…..ఓ వైపు రాజకీయాలు వద్దు అంటూనే…కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. . 90 శాతం ఉన్న బడుగు బలహీనవర్గాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కోదండరాంకు తగిన రితిలో బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో కోదండరాంది శిఖండి పాత్రని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
జేఏసీ ముసుగులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక ఏజెండాతోనే కోదండరాం ముందుకు వెళుతున్నారని సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉందని స్పష్టం చేశారు. కోదండరాంకు గతం నుంచే కాంగ్రెస్‌తో సంబంధాలున్నాయని…2014లోనే కాంగ్రెస్‌తో ములాఖత్ అయ్యారని మండిపడ్డారు. ఇకనైనా కోదండరాం పిచ్చి పనులు చేయడం ఆపేయాలని సూచించారు.