బీజేపీ, కాంగ్రెస్‌లవి దిగజారుడు రాజకీయాలు- ఎమ్మెల్యే బాల్క

210
MLA Balka Suman
- Advertisement -

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్‌ అయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకోవడం సరికాదని.. అడ్డుకోవడమే బీజేపీ పని అయితే… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడని, బండి సంజయ్ పాదయాత్ర చేయలేడని హెచ్చరించారు.

బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని, పాపాలను కడుక్కునే యాత్ర అని ఎద్దేవా చేశారు. మోదీ అసమర్థత వల్ల దేశంలో కరెంట్ కోతలు ఏర్పడ్డాయని చెప్పారు. మన దేశంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తెలిపారు.

- Advertisement -