మగవారికే బట్టతల ఎక్కువ..ఎందుకు?

30
- Advertisement -

నేటి రోజుల్లో బట్టతలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా ఈ బట్టతల సమస్యతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి పది మందిలో దాదాపు నలుగురు లేదా ముగ్గురు పురుషులు బట్టతలతో భాదపడుతునట్లు సర్వేలు చెబుతున్నాయి. మరి పురుషులకే ఎక్కువగా బట్టతల ఎందుకు వస్తుంది ? పురుషులతో పోల్చితే మహిళల్లో బట్టతల శాతం తక్కువ ఎందుకు ? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం !

పురుషులకే బట్టతల ఎక్కువగా రావడానికి చాలానే కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఆందోళన మానసిక రుగ్మతలు ప్రధానంగా జుట్టుపై ప్రభావం చూపుతాయి. ఆఫీస్ వర్క్, ఇంటి బాద్యత.. ఇలా ఒక్కటేంటి పురుషులు మానసికంగా ఎదుర్కొనే సమస్యలు అనేకం. ఇలా మానసిక రుగ్మతల కారణంగా, కోపం, ఆలోచనలు, ఒత్తిడి పెరిగి జుట్టుపై ప్రభావం చూపుతాయి. తద్వారా పురుషులకు వేగంగా బట్టతల రావడానికి కారణమవుతుంది. ఇంకా కొందరిలో జీన్స్ ద్వారా కూడా బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది. పురుషుల్లో సహజంగా ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ శాతం విపరీతంగా పెరిగినప్పుడు జుట్టు వేగంగా రాలిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగినప్పుడు అడ్రినల్ గ్రంథులు యాండ్రోజనిక్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బ తినడంతో పాటు కృశించుకుపోతాయి. తద్వారా జుట్టు రాలిపోతుంది. పైగా ఆ స్థానంలో కొత్త జుట్టు మొలిచే అవకాశాలు తక్కువ. అందుకే పురుషుల్లో ఈ బట్టతల సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బట్టతల వచ్చిన తర్వాత బాధ పడడం కంటే రాక మునుపే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి వాటికి దూరంగా ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. జుట్టు సంరక్షణకు దోహదం చేసే ఆకు కూరలు, పండ్లు, చేపలు.. వంటి పౌష్టికాహారాన్ని ఆహార డైట్ లో చేర్చుకోవాలి. జుట్టు వేగంగా ఎక్కువగా రాలిపోతుంటే.. హెయిర్ స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి.

Also Read:Revanth:కమ్యూనిస్టులతో కటిఫ్?

- Advertisement -