అఘోరాగా నందమూరి హీరో..!

741
nandamuri balakrishna
- Advertisement -

నటసింహా నందమూరి బాలకృష్ణ గత ఏడాది రూలర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బోయపాటి సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇక ఈ మూవీ కోసం బాలయ్య ఇప్పటివరకు కనిపించని గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

దాని కోసం ఇటీవల గుండు గీయించుకున్నారని ప్రచారమైంది. అంతేకాదు గుండుతో ఉన్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ మారాయి. బాలయ్య ఆ న్యూ లుక్ తోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. తాజా సమాచారం ప్రకారం బాల‌కృష్ణ అఘోరాగా క‌నిపించ‌నున్నాడంటూ ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.

Balayya

బాల‌కృష్ణ 106వ సినిమా కోసం ఇప్ప‌టికే బోయ‌పాటి రెండు సార్లు స్క్రిప్ట్ మార్చాడ‌ట‌. చివ‌రకి అఘోరా పాత్ర గురించి వివ‌రించ‌డంతో ఆ పాత్ర‌లో న‌టించేందుకు బాల‌కృష్ణ‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల‌ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టిన చిత్ర బృందం వార‌ణాశి వెళ్ళి అక్క‌డ ప‌లు లొకేష‌న్స్ సెర్చ్ చేశార‌ట‌. ఎంపిక చేసిన లొకేష‌న్స్‌లో చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. సంజ‌య్ ద‌త్ చిత్రంలో ప్ర‌తి నాయ‌క పాత్ర‌ని పోషించ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని 2021 ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -