రెండు రోజులగా సోషల్ మీడియాలో మంత్రి జగదీశ్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి ఉగాది పచ్చడిని సేవిస్తున్న ఫోటోను మార్ఫింగ్ చేసి మద్యం సేవిస్తున్నట్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్. ఉగాది పచ్చడి ఫోటోను మర్పింగ్ చేసి మద్యం సేవిస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పాల్గొన్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్,ఎంపీ కవితలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై చర్యలు తీసుకోగా తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.