రివ్యూ: బాలకృష్ణుడు..

233
Balakrishnudu Review
- Advertisement -

ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్.  బాణం మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండే వాడు, రాజా చేయి వేస్తే.. వంటి మూవీలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.  తాజాగా పవన్ మల్లెల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముందుకొచ్చాడు. రోహిత్ సరసన రెజీనా జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? నారా రోహిత్‌కు సక్సెస్‌ని అందించిందా..?లేదా చూద్దాం..

కథ:

రాయలసీమకు చెందిన భానుమతిదేవి(రమ్యకృష్ణ), ప్రతాప్‌రెడ్డి (అజయ్‌) మధ్య వివాదం నడుస్తుంటుంది. భానుమతిదేవి మేనకోడలు ఆద్య(రెజీనా)ని చంపి కక్ష తీర్చుకోవాలనుకుంటాడు ప్రతాప్‌రెడ్డి. దీనిని పసగట్టిన భానుమతి ఆద్యకు తెలియకుండానే ఆమెకు రక్షణగా బాలు(నారా రోహిత్‌) అనే అంగరక్షకుడిని నియమిస్తుంది. ఈ నేపథ్యంలో ఫాక్ష్యనిస్ట్‌ అయిన ప్రతాప్‌ ఆద్యను అంతమొందించాడా..?బాలు…ఆద్యని ఏ విధంగా రక్షించాడు..?వీరిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు..?అన్నదే బాలకృష్ణుడు కథ.

Balakrishnudu Review
ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్  నారా రోహిత్,కామెడీ,నిర్మాణ విలువలు. నారా రోహిత్ తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమ కోసం స్లిమ్‌గా మారాడు.  రెజీనా అందంతో ఆకట్టుకుంది. తన ఆహార్యంతో కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగానే చేసింది. భానుమతి దేవిగా రమ్యకృష్ణ,ఫ్యాక్షన్‌ పాత్రలో అజయ్ ఒదిగిపోయారు.  కమెడీయన్ పృథ్వీ నటన సినిమాకు మరో ప్లస్ పాయింట్‌. నారా రోహిత్‌, పృథ్వీల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కితకితలు పెడతాయి. మిగితావారు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్  రొటీన్‌ కథ,కథనం,సెకండాఫ్‌ సాగదీత. ఈ తరహా కథా కథనాలతో చాలా సినిమాలు వచ్చాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా.. సినిమాకి మంచి మార్కులు పడతాయి. హాస్యంతో కూడిన సన్నివేశాలపై మాత్రం తన పట్టుని ప్రదర్శించాడు దర్శకుడు విజయ్ మల్లెల. కథ,కథనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. విజయ్‌ సి.కుమార్‌ కెమెరా, మణిశర్మ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ చక్కగా కుదిరాయి.  నిర్మాణ విలువలు సినిమాకే హైలెట్‌.

Balakrishnudu Review

తీర్పు:

కమర్షియల్ ఫార్ములాతో దర్శకుడు పవన్ తెరకెక్కించిన చిత్రం బాలకృష్ణుడు. పృథ్వీ కామెడీ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ కథ,కథనం సినిమాకు మైనస్ పాయింట్స్. ఈ తరహా కథతో అనేక సినిమాలు రావడంతో కొత్త సినిమా చూసిన ఫిలింగ్‌ ప్రేక్షకులకు కలగదు. మొత్తంగా నారా రోహిత్ కితకితలు పెట్టేందుకు చేసిన ప్రయత్నమే బాలకృష్ణుడు.

విడుదల తేదీ:24/17/2017
రేటింగ్‌: 2.5 /5
నటీనటులు: నారా రోహిత్,రెజీనా
సంగీతం: మణిశర్మ
నిర్మాత: బి.మహేంద్రబాబు
దర్శకత్వం: పవన్‌ మల్లెల

- Advertisement -