ఈ కథకు నేనే హీరో….

243
Balakrishnudu Movie Theatrical Trailer
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. వరుస సినిమా విజయాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యువ హీరో శమంతకమణి విజయంతో బాలకృష్ణుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నారా రోహిత్‌ సరసన రెజీనా జంటగా  నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ మల్లెల దర్శకత్వం వహించారు. దసరా కానుకగా విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు రోహిత్.

ట్రైలర్ చూస్తే.. రెజీనాతో మనోడు పండించిన రొమాన్స్.. కత్తిలాంటి ఫైట్స్.. అలాగే కమెడియన్ పృధ్వీ కాంబినేషన్లో వచ్చిన సీన్లు అదిరిపోయాయ్. ఊర మాస్ హీరోగా తన స్థాయిని చాటుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో రోహిత్ కామెడీ టైమింగ్ కూడా అదిరింది. చూస్తుంటే  రోహిత్ ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

- Advertisement -