సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలయ్య..

85
nbk
- Advertisement -

విశాఖ జిల్లా సింహద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ . ఈ సందర్భంగా ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం కప్పస్తంబం ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం ప్రదర్శన అనంతరం వేదమంత్రాల ఆశీర్వాదంతో స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు అధికారులు.

బాలకృష్ణ వెంట దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఉన్నారు. ఇక విశాఖలో ఇవాళ సాయంత్రం అఖండ విజయోత్సవ సభ జరగనుంది.

- Advertisement -