బాలయ్యకి నయనతారే కావాలట

40
- Advertisement -

నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భగవంత్ కేసరి”లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు బాబీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను ఎనౌన్స్ కూడా చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బాలయ్య కూడా పూర్తి కథ విన్నారు. బాలయ్యకు ఈ కథ చాలా బాగా నచ్చిందట. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా బాగుందట. అందుకే, ఆ పాత్రలో నయనతారను తీసుకుంటే బాగుంటుంది అని బాలయ్య మేకర్స్ తో చెప్పినట్లు తెలుస్తోంది.

పైగా బాలయ్యే స్వయంగా నయనతారకు ఫోన్ చేసి.. ఈ సినిమా చేయాల్సిందిగా కోరాడు. గతంలో బాలయ్య- నయనతార ‘సింహా’ .. శ్రీరామరాజ్యం’ .. ‘జై సింహా’ వంటి సినిమాలు కలిసి పని చేశారు. కానీ, నయనతార రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఆమె సినిమాకి ఐదు కోట్లు డిమాండ్ చేస్తోంది. పైగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాబట్టి.. బాలయ్య సినిమాకి కూడా ఆమె భారీగా అడుగుతుంది.

Also Read: వయ్యారి భామ పాట లుక్‌ లో పవన్

మరోవైపు ఈసారి నయనతారతో కచ్చితంగా సినిమా చేయాల‌ని బాలయ్య నిర్ణయించుకున్నాడు. మరి దర్శకుడు బాబీ బడ్జెట్ ను ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. అన్నట్టు బాలయ్య ఈ సినిమాని 100 రోజుల్లోనే పూర్తి చేయాలని కోరారట. అనంతరం బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌తోనూ బాలయ్య బాబు ఓ సినిమా ఒప్పుకుంటున్నారని టాక్. పైగా బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌తో బాలయ్య చేసే సినిమాని బాలయ్య చిన్న కుమార్తె తేజ‌స్విని నిర్మించనున్నారు.

Also Read: విజయనిర్మల వర్ధంతి..

- Advertisement -