బాల‌య్య నోటి దూల.. పాపం టీడీపీ!

27
- Advertisement -

దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న నందమూరి సోదరులు సీనియర్ ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు వేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు భారీగా చేరుకుని.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.ఐతే, ఆ తర్వాత వచ్చిన బాలయ్య అక్కడున్న జూ.ఎన్టీఆర్ ప్లెక్సీలు చూసి సీరియస్ అయ్యారు.

వెంటనే, ‘వాటిని తీసేయండి..’ అంటూ బాలయ్య పలికిన ఈ డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కడుపు మండేలా చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. తప్పేం లేదు. అది తన ఇష్టం. కానీ బాలయ్యకి అది నచ్చలేదు. అందుకే ఎన్టీఆర్ ను తొక్కేస్తూ ముందుకుపోతున్నాడు. ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ పార్టీ జెండా కప్పుకుని జై జనసేన అని పలకడానికి కూడా ముచ్చట పడిన బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం తన ఇగో చూపిస్తున్నాడు.

అసలు బాలయ్యకి తెలియని విషయం ఏమిటంటే.. ఇప్పటి జనరేషన్ కి ఆ ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియదు. వారికీ తెలిసింది ఈ ఎన్టీఆర్ గురించే. పైగా బాలయ్య కంటే.. జూనియర్ కే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అంతెందుకు పవన్ కళ్యాణ్ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి బలం పెంచే దమ్ము ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ను తక్కువ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి బాలయ్య. మొత్తానికి నంద‌మూరి బాల‌కృష్ణ నోటి దురుసుకు ఆయ‌న పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేలా ఉంది.

Also Read:జగన్ వర్సెస్ షర్మిల.. పులివెందుల ఫైట్?

- Advertisement -