వయస్సు మీద పడినా ఇప్పటి వరకూ యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతు వరుస సినిమాలు చేస్తున్నాడు బాలకృష్ణ. తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించేందుకు నడుము కట్టాడు. కానీ ఉన్నట్టుండి ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నాడు.
ఈ నేపధ్యంలో బాలయ్యే నిర్మాతగా ఉంటూ దర్శకత్వ బాధ్యతలు బుజాన వేసుకునేందుకు ప్రయత్నించినా మళ్లీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో అ లోపు వీవీ.వినాయక్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక విషయమేమిటంటే ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ మారో సినిమా నిర్మించేందుకు సిద్దమయ్యాడు బాలయ్య.
సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నటుడుగా ఓ రేంజులో ఆకట్టుకున్న బాలయ్య నిర్మాతగా ఎంత విజయం సాధిస్తాడో చూడాలి.