జై సింహాతో ‘ఇంటిలిజెంట్’ టీజర్‌..!

210
Balakrishna to Launch 'Intelligent' Movie Teaser
- Advertisement -

సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి ‘ఇంటిలిజెంట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. వినాయక్ మార్క్ కి .. సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఈ సినిమా రూపొందిందని అంటున్నారు. ఇటివలే ఈ సినిమాక షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ టీజర్ ను నందమూరి హీరో బాలకృష్ణ చేతులమీదుగా లాంచ్ చేయడం విశేషం. అయితే బాలకృష్ణ లేటెస్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సి.కళ్యాణే ఇంటిలెజింట్ సినిమాకు కూడా నిర్మాత. దీనికితోడు డైరెక్టర్ వి.వి.వినాయక్ కు నందమూరి ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో బాలయ్య ఈ ఈవెంట్ కు రావడానికి దారి ఈజీ అయిందట.

Balakrishna to Launch 'Intelligent' Movie Teaser

ఇక ఈ టీజర్‌ గురించి చెప్పాలంటే “ఇక మీదట పేదోడికి ప్లాట్ ఫామ్ .. ధర్మాబాయ్ డాట్ కామ్” అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపిస్తూ, తన అభిమానులను మరింతగా ఆకట్టుకునేలా వున్నాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో సాయిధరమ్ తేజ్ వున్నాడు.

- Advertisement -